హైదరాబాద్: 28°C
వార్తలు

మధురవాడలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

VSP: మధురవాడ జోన్ 6వ వార్డులో సోమవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రేవళ్లపాలెం, స్టేడియం, కొమ్మాది ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు, చెత్త సేకరణ విధానాన్ని తనిఖీ చేశారు. ఇంటింటి చెత్త సేకరణ క్రమం తప్పకుండా నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.