హైదరాబాద్: 28°C
వార్తలు

మంగళగిరి విద్యార్థుల ఫీల్డ్ విజిట్

GNTR: మంత్రి లోకేష్ ఆదేశాలతో మంగళగిరి గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం విద్యార్థులను ఫీల్డ్ విజిట్‌కు తీసుకెళ్లారు. వారు చేనేత కేంద్రం, మున్సిపల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్‌లను చూశారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై అవగాహన పెంచుకున్నారు. ఈ పర్యటనతో విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, విజ్ఞానం పెంపొందాయని నిర్వాహకులు వెల్లడించారు.