హైదరాబాద్: 28°C
వార్తలు

ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ

AKP: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా 54 ఫిర్యాదులను స్వీకరించారు. భూ, ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. ప్రతి ఫిర్యాదుపై 7 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.