హైదరాబాద్: 28°C
వార్తలు

జీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 41 అర్జీలు

GNTR: ప్రజల నుంచి అందుతున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జీ. సాంబశివరావు అధికారులను ఆదేశించారు. నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు సోమవారం జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.