హైదరాబాద్: 28°C
వార్తలు

76 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి: కేంద్రం

దేశంలో ఇంధన నిల్వలకు ఎలాంటి ఢోకా లేదని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి వెల్లడించారు. దేశంలో 76 రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనమని.. దీన్ని వాడటం వల్ల రాబోయే రోజుల్లో ఇంధన ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని మోదీ దౌత్య విధానాల వల్ల అధిగమించినట్లు స్పష్టం చేశారు.