హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటి పొజిషన్ పత్రాలను పంపిణీ చేసిన మంత్రి

సత్యసాయి: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. సోమవారం పరిగిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ హౌసింగ్ పథకం కింద ఇళ్లు, సామాజిక భద్రతా పెన్షన్లు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం 723 మంది లబ్ధిదారులకు ఇంటి పొజిషన్ పత్రాలను పంపిణీ చేశారు.