హైదరాబాద్: 28°C
వార్తలు

నక్క బండ ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

CTR: పుంగనూరు నక్క బండ గాంధీనగర్ రోడ్డు పక్కన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. రోడ్డుకు ఆనుకొని చేతికి అందే అంత దూరంలోనే ఈ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. నిత్యం ఈ వీధిలో పాదాచారులు, వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.