హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి

సత్యసాయి: గోరంట్ల పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న, ప్రమాదంలో గాయపడిన పలువురు వైసీపీ నాయకులను మాజీ మంత్రి శంకరనారాయణ సోమవారం పరామర్శించారు. ఇటీవల ద్విచక్రవాహన ప్రమాదంలో గాయపడిన శిరగంవాడ్లపల్లికి చెందిన వైసీపీ నాయకుడు వెంకట శివారెడ్డి, కమ్మవారిపల్లికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ డీలర్ నారాయణరెడ్డిలను వారి నివాసాల్లో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు.