NRML: కుబీర్ పశు వైద్యశాల వైద్యాధికారిగా (వెటర్నరీ డాక్టర్) గణేశ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. భైంసా నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు ల్యాబ్ అసిస్టెంట్, సిబ్బంది శాలువా, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. డాక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని పశువుల పెంపకందారులు, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.
వార్తలు
కుబీర్ పశు వైద్యాధికారిగా గణేశ్ బాధ్యతల స్వీకరణ


