హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు

ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలు సమావేశమైన వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టడం కలకలం రేపాయి. దేశ రాజధానిలోని ప్రధాన కూడళ్లలో రాహుల్‌ను విమర్శిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేతకు నిలకడ లేదని, మేము కాంగ్రెస్‌పై ఆధారపడబోమంటూ ఇండియా కూటమికి చెందిన నేతలు ఆరోపణలు చేస్తున్నట్లు పోస్టర్లను ఏర్పాటు చేశారు.