హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అత్యంత ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్

NRML: తానూర్ మండలంలోని జౌల(కే) గ్రామంలోని సాయినాథ్ కిరాణా దుకాణం సమీపంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ అత్యంత ప్రమాదకరంగా మారింది. దారి పక్కనే ఉన్న దీనికి ఎటువంటి రక్షణ కంచె లేకపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే రక్షణ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.