తమిళనాడు ప్రముఖ యూట్యూబర్ మారిదాస్‌ను మధురై పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఐటీ శాఖ మంత్రిపై విమర్శలు చేయడంతోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ విమర్శలను తట్టుకోలేకే టీవీకే సర్కార్ ఈ చర్యకు పాల్పడిందని విపక్షాలు, నెటిజన్లు మండిపడుతున్నారు. గత డీఎంకే పాలన నాటి అణచివేత పంథానే సీఎం విజయ్ కూడా కొనసాగిస్తున్నారంటూ SMలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
వార్తలు
యూట్యూబర్ అరెస్ట్.. టీవీకే ప్రభుత్వంపై విమర్శలు


