ED, CBIని రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే కేంద్రం వాడుతుందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. ఈ సందర్భంగా దేశంలోని నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ధ్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. కొత్త ఉద్యోగాల సృష్టికి అవసరమైన పెట్టుబడులు దేశంలోకి రావట్లేదని చెప్పారు. పరీక్షల విధానం పూర్తిగా అస్తవ్యస్తమై లక్షలాది యువత భవిష్యత్తు దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
కేంద్రంపై ఖర్గే మండిపాటు


