హైదరాబాద్: 28°C
వార్తలు

ఇప్పటికీ ఐక్యతతోనే ఉన్నాం: ఖర్గే

ఇండియా కూటమి ఇప్పటికీ ఐక్యతతోనే ఉందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వెల్లడించారు. లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లులను ఐక్యంగా అడ్డుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రతిపక్షాల పోరాటం నిర్ణయాత్మక విజయమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నిరంతర దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తుందన్నారు.