హైదరాబాద్: 28°C
వార్తలు

అధిక ధరలకు యూరియా.. రైతులు ఆగ్రహం

TG: మంచిర్యాలలో అధిక ధరలకు యూరియా, DAP విక్రయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూరియా బస్తాపై రూ.60 అదనంగా తీసుకుని బిల్లులో మాత్రం తక్కువ వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తులు కొనాలనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పలు జిల్లాల్లోనూ ఇలాగే జరుగుతోందంటున్నారు.