హైదరాబాద్: 28°C
వార్తలు

ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు అడ్వైజరీ

ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌ క్షిపణులతో దాడులకు దిగడంతో.. ఇజ్రాయెల్ కూడా దీటుగా బదులిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే ఇరాన్‌ను వీడాలని అక్కడి భారతీయులకు సూచించింది. ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని తెలిపింది.