హైదరాబాద్: 28°C
వార్తలు

'వర్షాకాలం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి'

ADB: రానున్న వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని MPO కే. గంగాధర్ సూచించారు. సోమవారం గాదిగూడ మండలంలోని లోకారి(కే)లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వర్షాకాల సన్నద్ధత, సురక్షిత తాగు నీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, వన మహోత్సవం వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సర్పంచి పుష్పలత, పంచాయతీ కార్యదర్శి విజయ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.