మరో రెండు వారాల్లో నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ జరగనుంది. పేపర్ లీక్ ఆరోపణలతో ఇప్పటికే ఓసారి పరీక్షను రద్దు చేయడంతో రీ-టెస్ట్ నిర్వహణ విషయంలో NTA అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. పేపర్ తయారీ దశ నుంచే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొన్న నిపుణులను అత్యంత రహస్య ప్రదేశంలో ఉంచినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వార్తలు
నీట్-యూజీ 2026కు భారీ భద్రత


