హైదరాబాద్: 28°C
వార్తలు

మైలవరంలో వానలు.. రాబోయే 3 రోజులు అలర్ట్..!

NTR: మైలవరంలో ఆదివారం అర్థరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నాటికి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రాబోయే రెండు మూడు రోజుల వరకు ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందన్నారు. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.