హైదరాబాద్: 28°C
వార్తలు

పంచాయతీ శాఖలో పలువురికి పదోన్నతులు

తూ.గో: సీతానగరం మండలంలో విధులు నిర్వహిస్తున్న పలువురు పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు లభించాయి. డిప్యూటీ ఎంపీడీవో కే.వీ.ఎస్.ఎస్.ఎస్. మూర్తి ఎంపీడీవోగా పదోన్నతి పొందారు. అలాగే ములకల్లంక, జాలిమూడి కార్యదర్శులు గ్రేడ్-5 నుంచి గ్రేడ్-4కు, ఉండేశ్వరపురం, మిర్తిపాడు, కూనవరం, కాటవరం, బొబ్బిలంక కార్యదర్శులు గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కు పదోన్నతి పొందారు.