హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో మృగశిర కార్తె తొలకరి జల్లులు పలకరింపు

KMR: జిల్లాలో దాదాపుగా అన్ని మండలాలల్లో మృగశిర కార్తె తొలకరి జల్లులు పలకరించాయి. ఇప్పటికే భూమిని దుక్కి దున్ని చదును చేసిన రైతులు తొలకరి పలకరింపుకు ఎదురు చూశారు. నిన్నటి నుంచే వర్షాలు కురవడంతో సంతోషంతో రైతన్నలు పండగ చేసుకుంటున్నారు. ఈ ఏడాదంతా జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని దేవుళ్ళకు మొక్కుతున్నారు.