హైదరాబాద్: 28°C
వార్తలు

కష్టపడిన కార్యకర్తలకు కనీస స్పందన కరువైంది: మాజీ మంత్రి

కృష్ణా జిల్లా పెడనలో జరిగిన SIR కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్నినాని పాల్గొన్నారు. పోలీస్, రెవెన్యూ కార్యాలయాల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలకు డబ్బులిస్తేనే పనులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక సొంత పార్టీ శ్రేణుల పరిస్థితి దయనీయంగా మారిందని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస స్పందన కరువైందని విమర్శించారు.