W.G: తాడేపల్లిగూడెం (M) జగన్నాధపురంలో ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు విష్ణుయోగ్ యోగా కేంద్రం వ్యవస్థాపకురాలు పెనుమర్తి ప్రశాంతి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. యోగాను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వార్తలు
జగన్నాధపురంలో 10న యోగా తరగతులు ప్రారంభం


