హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్ర స్థాయికి ఎంపికైన జగిత్యాల చిన్నారి

JGL: కరీంనగర్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్- 13 బాలికల జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీల్లో జగిత్యాలకు చెందిన విద్యార్థిని పేరాల కృష్ణిక ప్రతిభ చాటింది. హోరాహోరీగా సాగిన పోటీల్లో అద్భుత విజయాలు సాధించి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. కృష్ణిక విజయం జిల్లాకే గర్వకారణమని కోచ్ కంది అజయ్ తెలిపారు.