MLG: వనదేవతలైన సమ్మక్క-సారలమ్మల దీవెనలతో కుమారుడు జన్మించాడనే నమ్మకంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన సమ్మయ్య వివాహాన్ని ఆదివారం తాడ్వాయి మండలంలోని మేడారంలో ఘనంగా నిర్వహించారు. వధువు కవితతో కలిసి అమ్మవార్ల సన్నిధిలో వివాహం జరిపించిన కుటుంబ సభ్యులు, గతంలో మొక్కుకున్న తర్వాతే కుమారుడు పుట్టాడని పేర్కొన్నారు.
వార్తలు
మేడారంలో ఘనంగా ఆదివాసీ యువకుడి వివాహం


