అన్నమయ్య: ఏపీలో గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు డాక్టర్ వి.ఆర్ రాసాని తెలిపారు. మదనపల్లి ప్రధాన శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన.. అమరావతిలో రూ.137 కోట్లతో భారీ గ్రంథాలయం నిర్మిస్తున్నామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో గ్రంథాలయ వ్యవస్థ బలోపేతానికి కృషి జరుగుతోందన్నారు.
వార్తలు
'గ్రంథాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది'


