హైదరాబాద్: 28°C
వార్తలు

మెదక్ జిల్లాలో రూ.664 కోట్ల ధాన్యం కొనుగోళ్లు

MDK: జిల్లాలో ఇప్పటివరకు 81,266 మంది రైతుల నుంచి 3,75,471 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 62,363 మంది రైతులకు రూ.664.67 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయని, 260 కేంద్రాలను మూసివేశామని చెప్పారు. ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని కలెక్టర్ హామీ ఇచ్చారు.