హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌ షిప్ పోటీలు ప్రారంభం

జగిత్యాల పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇండియన్ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ ఎగ్జామినర్ రచ్చ శ్రీనుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 500 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి కరాటే ఎంతో దోహదపడుతుందన్నారు.