హైదరాబాద్: 28°C
వార్తలు

ఖాళీ సిలిండర్లతో రోడ్లపైకి బీజేపీ రాదేం: ఖర్గే

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మరోసారి ధ్వజమెత్తారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణంపై నిరసనగా ఖాళీ LPG సిలిండర్లతో రోడ్లపైకి వచ్చిన బీజేపీ ఇప్పుడు అదే పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గత 12 ఏళ్లలో గ్యాస్ సిలిండర్‌పై రూ.530 పెరగడం వాస్తవం కాదా అని నిలదీశారు. LPG ధర పెంచినందుకు కేంద్రం మూల్యం చెల్లించుకోక తప్పదని NCP (SP) అధినేత శరద్ పవార్ అన్నారు.