W.G: CM చంద్రబాబు సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:25 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు సిద్ధాంతం చేరుకుంటారు. 11:15 గంటలకు గ్రామ సభలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 3:15 నుంచి 4:45 వరకు పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సిద్ధాంతం నుంచి హెలికాప్టర్ ద్వారా ఉండవల్లి చేరుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
వార్తలు
నేడు జిల్లాకు సీఎం రాక..!


