ఆసిఫాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం మహిళా అధ్యక్షురాలిగా రెబ్బెన మండలానికి చెందిన కుందారపు శంకరమ్మ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శంకరమ్మ మాట్లాడుతూ.. జిల్లాలో మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన సంఘం నాయకులు, కుల పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
మున్నూరు కాపు సంఘం మహిళా అధ్యక్షురాలిగా శంకరమ్మ


