హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీకాళహస్తిలో ఐదుగురి అరెస్ట్

TPT: శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని విశాలాక్షి నగర్‌కు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ ఇబ్రహీం తెలిపారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన దాడిలో నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.4,800 నగదు, ఐదు సెల్ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.