హైదరాబాద్: 28°C
వార్తలు

స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. క్లారిటీ

AP: రాష్ట్రంలో స్కూళ్ల రీఓపెన్‌పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. వేసవి సెలవులను పొడిగించే ప్రతిపాదన లేదని తెలిపింది. ముందుగా ప్రకటించినట్లే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఈనెల 12న పునఃప్రారంభం కానున్నాయని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు SMలో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని సూచించింది. TGలో స్కూళ్ల రీఓపెనింగ్‌‌ను 15వ తేదీకి వాయిదా వేశారు.