హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 20న జాతీయ లోక్ అదాలత్

GDWL: గద్వాలలో జూన్ 20న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, సివిల్, కుటుంబ వివాదాలను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. సమయం, డబ్బు ఆదా చేసుకునేందుకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.