హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్‌

AP: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌ ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అమరావతిలోని వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ముగ్గురు అభ్యర్థులు సైకిళ్లపై ర్యాలీగా అసెంబ్లీకి చేరుకుంటారు. ఉదయం 10:45 గంటలకు నామినేషన్లు సమర్పిస్తారు. వీరి నామినేషన్లను టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చనున్నారు.