హైదరాబాద్: 28°C
వార్తలు

SP కార్యాలయంలో గ్రీవెన్స్ డే

CTR: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమ వేదికలో స్వల్ప మార్పు చేసినట్లు చిత్తూరు SP పీఆర్వో తెలిపారు. చిత్తూరులో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉ.10:30 గంటలకు కుప్పం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీసు అధికారులకు నేరుగా తెలియజేసి పరిష్కారం పొందవచ్చన్నారు.