KRNL: మంత్రాలయంలో మఠం వసతి గృహాల లభ్యతను తెలియజేసే నూతన డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల మేరకు మేనేజర్లు శ్రీనివాసరావు, నరసింహమూర్తి ఆదివారం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. టీటీడీ తరహాలో ఏ వింగ్‌లో ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయో లైవ్‌లో తెలుసుకునే వీలుండటంతో భక్తులకు వసతి కేటాయింపులు మరింత సులభతరం కానుంది.
వార్తలు
మంత్రాలయంలో TTD తరహా టెక్నాలజీ..!


