హైదరాబాద్: 28°C
వార్తలు

జూ పార్క్‌కు రికార్డు స్థాయిలో సందర్శకులు

TG: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 24,210 మంది సందర్శకులు వచ్చారు. 380 ఎకరాల్లో 195 జాతుల వన్యప్రాణులతో ఉన్న ఈ జూకు ఈ ఏడాది సెలవు రోజుల్లో రద్దీ పెరగడంతో అదనపు బుకింగ్ కౌంటర్లు తెరిచి అధికారులను విధుల్లో ఉంచారు. సెలవులు ముగుస్తుండటం, ఆదివారం సెలవు రోజు కావడంతో సందర్శకులు భారీగా తరలొచ్చారు.