హైదరాబాద్: 28°C
వార్తలు

తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: అచ్చెన్నాయుడు

AP: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకతకు APAIMS 2.0 అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఎరువుల దారి మళ్లింపులు అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌలు రైతులకూ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.