హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు బీజేపీకి అన్నామలై భయం

తమిళనాడు బీజేపీకి యువనేత అన్నామలై భయం పట్టుకుంది. ఇటీవల అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి కొత్త రాజకీయ ఉద్యమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర బీజేపీకి చెందిన నేతలంతా ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నాగరాజన్, జనరల్ సెక్రటెరీ వెంకటేష్, మరో 300 మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి అన్నామలైకు తమ మద్దతును ప్రకటించారు.