హైదరాబాద్: 28°C
వార్తలు

టీఎంసీ ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి!

TMC MLA మదన్ మిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. కమార్‌హాటీ నియోజకవర్గంలో అరియాదయా ప్రాంతంలో పర్యటనకు వెళ్లగా.. తమ సమస్యలను చెప్పేందుకు ప్రజలు గుమిగూడారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోడిగుడ్లు విసిరారు. అంతేకాకుండా MLA కాన్వాయ్‌పై కూడా దాడి చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ముందస్తు వ్యూహంలో భాగంగానే BJP నేతలు తమపై దాడి చేశారని ఆరోపించారు.