హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవ కొనసాగిస్తాం'

E.G: అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చామో, ప్రతిపక్షంలో ఉన్నా అదే స్థాయిలో ప్రజా సేవ కొనసాగిస్తామని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం రాజమండ్రి ఆనంద్ నగర్, బెట్టి కాన్వెంట్ రోడ్డులో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు.