ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య విభజన ప్రేరేపిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. దేశాన్ని ఇలా విభజించొద్దని హితవు పలికారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా మనమంతా భారతీయులమేనన్నారు. తూర్పు భారతం నుంచి రాష్ట్రపతిగా ముర్ము, పశ్చిమ భారతం నుంచి పీఎంగా మోదీ, దక్షిణ భారతం నుంచి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఉన్నారని చెప్పారు.
వార్తలు
రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం


