సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల కానుకలు గల్లంతయ్యాయని ఆరోపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులకు సంబంధించిన సున్నితమైన అంశం కాబట్టి కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి విచారణ జరపాలని కోరారు. ఈ దోపిడిపై ప్రభుత్వం మౌనం వహించడంపై అనుమానం వ్యక్తం చేశారు.
వార్తలు
రామమందిరంలో కానుకలు మాయం?: అఖిలేష్


