హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం భార్య ప్రశంస

బెంగాల్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా ప్రశంసలు కురిపించారు. నూతనంగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం హామీలను వేగంగా అమలు చేస్తోందని కొనియాడారు. హామీల అమలును చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. పాలన విషయంలో టీఎంసీ, లెఫ్ట్ ప్రభుత్వానికి పోలిక లేదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బెంగాల్ పూర్వ వైభవాన్ని, కీర్తిని పునరుద్ధరిస్తే స్వాగతిస్తామని చెప్పారు.