హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు 23 పార్టీలతో ఇండి కూటమి మీటింగ్

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో రేపు ఇండియా కూటమి పార్టీల సమావేశం జరగనుంది. దేశంలోని రాజకీయ పరిస్థితులు, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కూటమిని మరింత బలోపేతం చేయడంపై అన్ని పార్టీల నేతలు చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో మొత్తం 23 పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, మాజీ సీఎంలు అఖిలేష్, మమతాతో పాటు జాతీయ నాయకులు పాల్గొననున్నారు.