PLD: చిలకలూరిపేటలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి భానుడు తీవ్ర ప్రతాపం చూపాడు. మండుతున్న ఎండ, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత వాతావరణం అకస్మాత్తుగా చల్లబడింది. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో వేడితో విలవిలపడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.
వార్తలు
VIDEO: పేటలో ఒక్కసారిగా మారిన వాతావరణం


