NLR: అరుదైన ఐదు రూపాయల నోటు ఉంటే పది లక్షలు ఇస్తామంటూ వచ్చే ఫోన్స్ కాల్ పట్ల జాగ్రత్త వహించాలని బుచ్చి సీఐ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కేటుగాళ్లు డబ్బులు వసూలు చేసి పరార్ అవుతున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
వార్తలు
ఏపీకే ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి: సీఐ


