హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కాలభైరవ ఆలయంలో అష్టమి పూజలు

KDP: వల్లూరు( M) పుష్పగిరి పుణ్యక్షేత్ర సమీపంలో ఉన్న కాలభైరవాలయంలో సోమవారం అష్టమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరగనున్నాయని నిర్వాహకులు భరద్వాజ రెడ్డి ఆదివారం తెలిపారు.గ్రహదోష నివారణ కొరకు ప్రత్యేక హోమాభిషేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు విరివిగా తరలి రావాలన్నారు.