హైదరాబాద్: 28°C
వార్తలు

నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో మౌలిక వసతుల కొరత

 PLD: నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో మౌలిక వసతుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమృత్ పథకం పనులు నత్తనడకన సాగుతుండగా, ప్లాట్‌ఫాం-2లో తాగునీరు, లైటింగ్, సూచిక బోర్డులు లేక అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న రద్దీకి తగిన సదుపాయాలు, భద్రతా చర్యలు లేకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.